ఘనంగా బోనాల ఉత్సవాలు

67చూసినవారు
ఆషాఢమాసం పురస్కరించుకొని ప్యాపిలీ పట్టణంలోని మహిళలు బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. దిగువ వీధి నుంచి పెద్దమ్మ ఆలయం వరకు మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామం సుభిక్షంతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలు కొలువు తీరాలని అమ్మవారికి పూజలు నిర్వహించామని మహిళలు, రైతులు తదితరులు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్