నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: ఏఎంఓ
గడివేములలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరీ ఆఫీసర్ లలితకుమారి మాట్లాడుతూ జిల్లాలో నాడు-నేడు పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. వాటిని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని హెచ్ఎంలకు సూచించారు. ఒక్కో పాఠశాల వారీగా పనుల పురోగతిని సంబంధిత సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా హెచ్ఎంల యొక్క పలు సందేహాలను నివృత్తి చేశారు.