అరుదైన ఘటన.. కవల పిల్లలకు జన్మనిచ్చిన బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితురాలు

1063చూసినవారు
అరుదైన ఘటన.. కవల పిల్లలకు జన్మనిచ్చిన బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితురాలు
మధ్యప్రదేశ్‌లోని అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్లడ్‌ క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఓ మహిళ.. కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె మొదటిసారి ఆసుపత్రికి వచ్చినప్పుడు బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్న విషయం చెప్పలేదు. గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఆమెకు సాధారణ ప్రసవం చేశామని గైనకాలజిస్ట్‌ సుమిత్రా తెలిపారు. మైయెలాయిడ్‌ లుకేమియా ఉన్న మహిళలకు సురక్షిత ప్రసవం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు తెలిపారు.