Dec 31, 2024, 13:12 IST/
మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
Dec 31, 2024, 13:12 IST
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన భార్య గురుశరణ్ కౌర్ కు జడ్ ప్లస్ భద్రత కొనసాగించడంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మన్మోహన్ సింగ్ భార్యకు జడ్ ప్లస్ భద్రతను ఇకపై కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఆమె విషయంలో జెడ్ ప్లస్ కేటగిరీ కింద సీఆర్పీఎఫ్ రక్షణ కొనసాగిస్తుందని వెల్లడించింది. ఆమె ప్రాణాలకు ముప్పునకు సంబంధించిన అంశంపై సమీక్ష తర్వాత నిర్వహిస్తామని తెలిపింది.