నల్గొండ జిల్లాలోని SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. SLBC, బ్రాహ్మణవెళ్ళాంల తనకు ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. నల్గొండ ప్రజల దశబ్దాల కల SLBC అని ఆయన వ్యాఖ్యానించారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని, చాలా భాద్యత తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.