హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొండాపూర్‌లో రాజరాజేశ్వరి అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిప్పు రవ్వలు ఎగిసిపడుతుండడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.