ఆమనగల్లు: హెచ్ఎంపై దాడికి ప్రజా సంఘాల నిరసన

64చూసినవారు
ఆమనగల్లు: హెచ్ఎంపై దాడికి ప్రజా సంఘాల నిరసన
మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై అయ్యప్ప మాలలు వేసుకున్న వారు చేసిన దాడిని నిరసిస్తూ మంగళవారం ఆమనగల్లులో ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల వేసుకున్న విద్యార్థిని అవమానపరిచారని ఆరోపిస్తూ దాడి చేయడం విచారకరమన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్