కడ్తాల్ మండలం హనుమస్ పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో 11 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన పత్రీజీ ధ్యాన మహాయాగం మంగళవారం ముగిసినది. ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు కేక్ కట్ చేసి ఉత్సవాలకు ముగింపు పలికారు. యాగంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి వేలాది మంది ధ్యానులు విచ్చేసి 11 రోజులపాటు అఖండ ధ్యానంలో పాల్గొన్నారు.