2024 క్యాలెండర్ ఇయర్ నేటితో ముగిసిపోనుంది. రేపటి నుంచి 2025 కొత్త సంవత్సరం(new year) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరంలో చివరి సూర్యాస్తమయం కనువిందు చేసింది. ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్ లో ఈ ఏడాది చివరి సూర్యాస్తమయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సూర్యుడు అస్తమిస్తున్న క్షణాలను సెల్ ఫోన్లలో బంధించి షేర్ చేస్తున్నారు.