AP: వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చీకటి జీఓలతో ఆలయాల ఆదాయాలను ఇతర పనులకు వినియోగించారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కు దేవుడి మీద కన్నా హుండీ మీదనే ఎక్కువ భక్తి ఉందని అన్నారు.