కుమార్తెను కర్నూలులో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తుండగా, కోడుమూరు పట్టణ సమీపంలోని ఎస్. లింగందిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమ్మరి హేమాద్రి (38) మృతి చెందాడు. కొనకొండ్లకు చెందిన హేమాద్రి తన కూతురు త్రివేణిని స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్ష రాయించేందుకు పత్తికొండలోని స్నేహితుడి కారులో డ్రైవర్‌తో పాటు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సీఐ గంగాధర్ ఈ విషయాన్ని మంగళవారం తెలిపారు.