Jan 22, 2025, 13:01 IST/
40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు: ఉత్తమ్
Jan 22, 2025, 13:01 IST
తెలంగాణలో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు తీసుకొస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్(D) నారాయణపూర్లో బుధవారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. రేషన్ దుకాణాల్లో ఇక నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయయోగ్యమైన భూములకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా ఎకరాకు రూ.12 వేలు ఇస్తామన్నారు.