మహారాష్ట్రలో సంభవించిన రైలు ప్రమాదంలో భయమే ప్రయాణికుల ప్రాణాలు తీసినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ లాగడంతో అగ్ని ప్రమాదం జరిగిందని భావించి అనేక మంది ప్రయాణికులు కిందకు దిగి ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో పక్క ట్రాక్ పై బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు దూసుకురావడంతో ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.