దిల్ రాజు కుమార్తె ఇంట ముగిసిన ఐటీ సోదాలు

59చూసినవారు
దిల్ రాజు కుమార్తె ఇంట ముగిసిన ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఐటీ దాడులు ముగిశాయి. ఆమె నివాసంలో లాకర్స్‌తో పాటు పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుంచి హన్షితా రెడ్డి నివాసంలో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. నిన్న ఆమె తన నివాసంలో లేకపోయినా రైడ్స్ జరిగాయి. దిల్ రాజు భార్య ఉంటున్న నివాసంలో కూడా ఈ సోదాలు నిర్వహించారు. అంతేకాక, దిల్ రాజు చేసిన మూడు సినిమాల కలెక్షన్స్ వివరాలు కూడా అడిగి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్