మాజీ మంత్రి కొడాలి నానికి బైపాస్ సర్జరీ ప్రారంభం

84చూసినవారు
మాజీ మంత్రి కొడాలి నానికి బైపాస్ సర్జరీ ప్రారంభం
AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను హైదరాబాద్ నుంచి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో నానికి బైపాస్ సర్జరీని డాక్టర్లు ప్రారంభించారు. ప్రముఖ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరుగుతోంది. దాదాపు 8 గంటల పాటు ఆయనకు సర్జరీ జరగనుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్