కఛత్తీస్‌గఢ్‌లో గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లతో వందలాదిమంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టుల కేంద్ర కమిటీ తాజాగా సంచలన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్రంతో తాము శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నట్లు కమిటీ పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండను వెంటనే ఆపాలని కోరింది. అలాగే తాము కాల్పుల విరమణ కూడా ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు.