15 సార్లు పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు మృతి (వీడియో)

69చూసినవారు
కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి యాదగిరికి వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి 15 సార్లు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి మౌలా అబ్దుల్ (35), అతడి కుమారులు రెహమాన్ (15), సమీర్ (10) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన వారు కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్