మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ముచ్చిగిరి గ్రామంలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయడం జరిగింది.
పెద్దకడబురు మండలంలోని మూచ్చిగిరి గ్రామంలో ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో విద్యా కమిటీ ఛైర్మన్ ఈరన్న ఆధ్వర్యంలో గురువారం జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ ఈరన్న, సర్పంచ్ హనుమంతు, ఉప సర్పంచ్ యల్లప్ప, సచివాలయ కన్వీనర్ సురేష్ గౌడ్, డీలర్ నాగప్ప, నట్టేకల్ నరసప్ప ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.