మండల కేంద్రము కోసిగిలో శ్రీ కోసిగయ్య దేవాలయంలో పెండేకంటి అంజినయ్య కుమారుని వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండల నాయకులు వందగల్లు కాల్వ లక్ష్మయ్య మనవరాలిని, పెండేకంటి అంజినయ్య కుమారున్ని అశ్వీరదించి, అక్షింతలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, మాజీ యంపీపీ బీమక్క, వందగల్లు లక్ష్మయ్య, నాడిగేని నాగరాజు, వందగల్లు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.