టీచర్ పై సస్పెన్షన్ వేటు

75చూసినవారు
టీచర్ పై సస్పెన్షన్ వేటు
కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న భీమన్నను కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో 6, 7, 8 తరగతి చదువుతున్న బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తమ దృష్టికి అనేక ఫిర్యాదులు అందాయన్నారు. ఈ ఘటనను విచారణ జరిపి భీమన్నను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్