పెద్దకడబూరు: చినుకు పడితే రహదారి చిత్తడే

68చూసినవారు
పెద్దకడబూరు: చినుకు పడితే రహదారి చిత్తడే
పెద్దకడబూరు గ్రామంలోని దొడ్డిమేకల సర్కిల్ సమీపంలో ఎమ్మిగనూరుకు వెళ్లే ప్రధాన రహదారి చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతోందని స్థానికులు వాపోయారు. వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో నీరు రహదారిలోనే నిల్వ ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. గ్రామ పంచాయతీ స్పందించి డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేసి నీరు నిల్వ ఉండకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్