జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 200 రోజులు పని దినాలు కల్పించి, రూ. 600 కూలి వేతనం ఇవ్వాలని, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం మిడుతూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు నందు నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో పిడి. జనార్ధన్, సీఈఓ భాస్కర్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాటేపోగు సోమన్న, కురువ పెద్ద రాముడు, తిరుపాలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.