ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నేడు ప్రజల్లో సంతృప్తికరమైన, ప్రజలు మెచ్చిన విధంగా పాలన కొనసాగుతున్నదని, ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల నుంచి వచ్చే స్పందన కొనియాడ తగినదని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిత్త జయసూర్య చేపట్టారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.