నంద్యాలలోని గాంధీ చౌక్ లో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ సీపీఎం పార్టీ జిల్లా నాయకులు నాగరాజు, నరసింహ ప్రజలతో కలిసి బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజల నడ్డి విరిస్తోన్న గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.