శ్రీశైలంలో శనివారం తెల్లవారుజామున నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. శ్రీశైలంలోని శనగల బసవన్న నంది విగ్రహం చెవిలో తమ కోరికలు తెలుపుకుంటే నెరవేరుతాయన్న నమ్మకంతో నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధి చెందేలా దీవించాలని శనగల బసవన్న చెవిలో ఎంపీ శబరి చెప్పుకున్నట్లు చెప్పారు.