1949 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని నంద్యాల జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డిఆర్ఓ రాము నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.