నంద్యాల రోటరీ క్లబ్ సభ్యులు అయ్యన్న తన సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు. ఉప్పరి వీధి దుర్గమ్మ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 5,500 రూపాయల విలువగల సరుకులను శ్రీ వీరాంజనేయ స్వామి కమిటీ సభ్యులకు అందించారు. వారికీ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని సభ్యులు ప్రార్థించారు. కార్యక్రమంలో భాగస్వాములైన వారిని ప్రత్యేకంగా అభినందించారు.