మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నందుల ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. నంద్యాల నుండి మహానంది వరకు నవనందులను దర్శించుకుంటూ పాదయాత్రగా బయలుదేరారు. ముఖ్యఅతిథులుగా కమలానంద భారతి స్వామి, రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు. తమ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్ట నిర్వాహకులు శివకుమార్ రెడ్డి తెలిపారు.