ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నంద్యాల జిల్లా స్వర్ణోత్సవ మహాసభలు ఆదివారం కోవెలకుంట్ల పట్టణంలో నిర్వహించనున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు, కార్యకర్తలు హాజరుకావాలని యుటిఎఫ్ ప్యాపిలి మండల అధ్యక్షుడు రమేష్ నాయుడు పిలుపునిచ్చారు. 50 సంవత్సరాలలో సాధించిన హక్కులు, ఎదుర్కొన్న సవాళ్లపై ఆయన వివరించారు. స్వర్ణోత్సవ కరపత్రాలు విడుదల చేశారు.