నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఈనెల 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ సంతాన లక్ష్మి, వడి బియ్యం పూజలను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఆలయ అర్చకులు నారాయణస్వామి తెలిపారు. రెండు వేల మంది పైగా మహిళలకు వడి బియ్యం, వెయ్యి మందికి పైగా సంతానం లేని మహిళలకు సంతాన లక్ష్మి పూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.