నంద్యాలలో చిరు వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తుల సమస్యలు సానుకూల దృక్పథంతో పరిశీలించి వారి జీవనోపాధి దెబ్బతినకుండా ప్రయోజనాలు కాపాడుతామని మంత్రి ఫరూక్ ఆదివారం నంద్యాల టిడిపి కార్యాలయంలో అన్నారు. నంద్యాల చిన్న , వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మంత్రిని కలిసి కేంద్ర వీధి వ్యాపారస్తుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.