స్వర్ణాంధ్ర లక్ష్య సాధన దిశగా జిల్లా అభివృద్ధి రూపొందించండి

62చూసినవారు
స్వర్ణాంధ్ర@2047 దార్శనిక పత్ర రూపకల్పనలో భాగంగా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్వర్ణాంధ్ర@2047 ప్రణాళికపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జేసి విష్ణు చరణ్, డిఆర్ఓ ఏ. పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్