నంద్యాల శిల్పా కుటుంబం గత రెండు దశాబ్దాలకు పైగా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను నిరంతరాయంగా కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా సేవలను అందిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాల శిల్పా సేవా సమితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనిట్ అనంతపురం వారి ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల పాలకవర్గ సభ్యులకు సభ్యులకు సహకార సంఘం నిర్వహణ, విధులు, భాధ్యతలపై శిక్షణా నిర్వహించారు.