ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.