కన్నడ రచయితగా, సంగీత విద్వాంసునిగా శ్రీ భక్త కనకదాసు గుర్తింపు తెచ్చుకుని తన కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ లో శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవ సందర్భంగా శ్రీ భక్త కనకదాసు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో పాటు జేసి విష్ణు చరణ్, తదితరులు పుష్పమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.