పాములపాడు: మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి
ఇంటింటికీ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ లింగాల స్వాములు మాదిగ గురువారం పిలుపునిచ్చారు. పాములపాడు మండలం మిట్ట కందల గ్రామంలో చెట్లు నాటి ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వాటిని నీరు పోసి పరిరక్షించాలన్నారు. చెట్ల వలన మనకు స్వచ్ఛమైన గాలి వర్షాలు మంచి వాతావరణము మంచి ప్రకృతి లభిస్తుందని ఆయన అన్నారు.