ట్రాఫిక్ జామ్ అంటే మహా అయితే రెండు, మూడు గంటలు వాహనాలు ఆగిపోవడం చూసుంటాం. కానీ చైనాలో ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2010 ఆగస్ట్ 14న జరిగిన ఈ ఘటనలో దాదాపు 100 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఈ ట్రాఫిక్ జామ్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మంగోలియా నుంచి బీజింగ్‌కు బొగ్గు, నిర్మాణ సామగ్రి ట్రక్కులు తీసుకెళ్లడం వల్ల ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.