
జోహారపురం నీటి సమస్యపై జనసేన నడుం బిగింపు
కర్నూలు జిల్లా జోహారపురం గ్రామంలో తాగునీటి సమస్యను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆలూరు నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప ఆదేశాల మేరకు, శనివారం ఓర్వకల్ మండలం పుడిచెర్లలో జరిగిన బహిరంగ సభలో గ్రామ ప్రజలు కుంట నీటిని బాటిల్లో తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అందించారు. త్వరలో సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.