డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని CM రేవంత్ పిలుపునిచ్చారు. పునర్విభజన ప్రక్రియపై అసెంబ్లీలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన అంశంపై ఐక్య కార్యాచరణ కోసం త్వరలో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.