ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదని BRS చీఫ్ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్ గానే అధికారంలోకి వస్తామని చెప్పారు. 'ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదని అన్నారు. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్ లా తయారవవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ తన మెడపై కత్తిపెట్టినా రాష్ట్రం కోసం వెనకడుగు వేయలేదన్నారు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.