బుల్లెట్లను పెనంపై వేడి చేసిన పోలీస్‌ అధికారి.. తప్పిన ప్రమాదం

60చూసినవారు
బుల్లెట్లను పెనంపై వేడి చేసిన పోలీస్‌ అధికారి.. తప్పిన ప్రమాదం
కేరళలోని కొచ్చికి చెందిన ఓ పోలీస్ అధికారి విచిత్రంగా బుల్లెట్లను పెనంపై ఉంచి వేడి చేశారు. దీంతో అవి ఒక్కసారిగా పేలిపోయాయి. ప్రముఖుల అంత్యక్రియల కోసం సిబ్బందికి గన్ పౌడర్‌తో ఉన్న బుల్లెట్లను అందజేస్తారు. ఈ క్రమంలో ఓ ఎస్‌ఐ‌ తన వద్ద బుల్లెట్లు తుప్పుబట్టడంతో వాటిని పెనంపై పెట్టి వేడి చేశారు. వాటిలో గన్‌పౌడర్ ఉండడంతో అవి ఒక్కసారిగా పేలిపోయాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్