బెయిల్‌పై గుంటూరు జైలు నుంచి పోసాని విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. "పోసాని దొంగతనం, మర్డర్లు చేయలేదు. మీడియా ముందు మాట్లాడడం తప్పా.. ఏ తప్పూ చేయలేదు" అని అన్నారు. రెండు సార్లు ప్రెస్‌మీట్‌లలో మాట్లాడితే 18 కేసులు పెట్టి, 24 రోజులు నిర్బంధించారు. పోసాని చేసిన నేరమేంటి? అని అంబటి ప్రశ్నించారు.