పాణ్యం: అదుపుతప్పి నర్సరీలోకి దూసుకువెళ్లిన కారు

50చూసినవారు
పాణ్యం పట్టణంలోని సాయిబాబా పూల మొక్కల నర్సరీ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు కారు అదుపుతప్పి నర్సరీలోకి దూసుకెళ్లింది. కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నర్సరీలోకి దూసుకు వెళ్లింది. ప్రమాద తీరును చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్