రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం తిరిగి ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయ డిమాండ్ చేశారు. గురువారం పాణ్యంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులకు విద్యతో పాటు నిలిచిపోయిన మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించాలని కోరారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించి, సమస్యలు తెలుసుకొన్నారు.