పాణ్యం: కూటమి ప్రభుత్వలో ప్రజలకు రక్షణ కరువైంది

53చూసినవారు
పాణ్యం: కూటమి ప్రభుత్వలో ప్రజలకు రక్షణ కరువైంది
కూటమి ప్రభుత్వలో ప్రజలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరులోని స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఆయన కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా క్షీణించాయన్నారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. నాలుగు నెలలకే రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ మార్చారన్నారు.

సంబంధిత పోస్ట్