గడపగడపకు మన ప్రభుత్వం
తుగ్గలి మండలం ,జి. ఎర్రగుడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణులకు వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ, పార్టీలకు అతీతంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో తుగ్గలి మండల వైసిపి కన్వీనర్ జిట్టా నాగేష్ యాదవ్, పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిట్టా లక్ష్మీదేవి, ఎర్రగుడి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, మండల వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.