వివాహం జరిగి రెండేళ్లు గడిచినా పిల్లలు కాలేదని ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం వెల్దుర్తి మండలం కొసనాపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడపకు చెందిన పద్మావతి కుమార్తె మహేశ్వరి(24)ని, కొసనాపల్లికు చెందిన మధుగౌడ్ తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు కాలేదు. ఈ విషయంలో మహేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో రసాయనిక ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుంది.