పత్తికొండలో ఖురాన్ పంపిణీ కార్యక్రమం

780చూసినవారు
పత్తికొండలో ఖురాన్ పంపిణీ కార్యక్రమం
పత్తికొండలోని ముస్లిం వీధిలో మంగళవారం రంజాన్ మాసం ను పురస్కరించుకొని ముస్లిం హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో ఖురాన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 300 మంది పిల్లలకు ఖురాన్ గ్రంధాలు, జానీమజ్, రిహాల్ పంపిణీ చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిమ్స్ హెల్ప్ సొసైటీ అధ్యక్షులు మీరా హుస్సేన్, ఉపాధ్యక్షుడు పి. రఫీ, ప్రధాన కార్యదర్శి డి. రఫిక్, హఫీజ్ ఫారుక్, మెహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్