మహానందిలో లక్ష బిల్వర్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు

76చూసినవారు
నంద్యాల జిల్లా మహానందిలో కార్తీక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మహానంది కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 29న లక్ష బిల్వర్చన, 30న లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్