తుగ్గలిలో 26 మిమీ వర్షపాతం నమోదు
కర్నూలు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 19 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా 39. 4, అత్యల్పంగా 0. 2 మి. మీ వర్షపాతం నమోదైంది. తుగ్గలిలో 26 మిమీ వర్షం కురిసింది. పత్తికొండలో 18. 6 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద సగటున 7. 8 మిమీ వర్షపాతం నమోదు అయ్యింది. అక్టోబరు నెల 19 వరకు సాధారణ వర్షపాతం 67. 5 మిమీ ఉండగా, 78. 6 మిమీ వర్షపాతం నమోదైంది.